Kurnool

Kurnool: ఇద్దరు కార్మికులు మృతి..

Kurnool: చావు రాసి ఉంటె ఎక్కడ ఉన్నా తప్పకుండా చస్తాం.. ఈ సామెతకి నిదర్శనం ఈ చావులు.. భవన నిర్మాణానికి వెళ్తే చావు వస్తుంది అని ఎవరు అనుకోరు కదా.. పని చేసుకుందాం అని పొయ్యి సావుని కొని తెచ్చుకున్నారు.. ఇల్లు కట్టిస్తాం అని కాంట్రాక్టు తీస్కొని ఆ ఇల్లు కట్టే జాగాలోనే శవాలయ్యి మిగిలారు..

భవన నిర్మాణానికి పునాది పనులు చేస్తుండగా పైనుంచి మట్టి పెల్లలు మీద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండు ఎదురుగా చికెన్ వల్లీ తన స్థలంలో భవనం నిర్మాణం చేపట్టారు. సెంట్రింగ్ పనులను మేస్త్రీ ఇస్మాయిల్‌కు అప్పగించగా.. పునాధికి మట్టి లూజుగా ఉండటంతో దాదాపు 8 నుంచి 10 అడుగుల లోతు నుంచి పిల్లర్లు తీస్తున్నారు.

ఒకవైపు పిల్లర్లు నిర్మించి మరోవైపు పిల్లర్లు నిర్మాణానికి మట్టి చదును చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పునాది గుంతలో పనిచేస్తున్న పట్టణంలోని వెస్టు బీసీ కాలనీలో నివాసముంటున్న తలారి గోకారి కుమారుడు తలారి మధు, ఎస్సీకాలనీకి చెందిన కాకి పోతన్న కుమారుడు కాకి సోమన్న పై మట్టి పెల్లలు పడ్డాయి.

Also Read: Turkey: ఇస్తాంబుల్‌లో భూకంపం – టర్కీతో పాటు పొరుగుదేశాల్లోనూ ప్రకంపనలు

Kurnool: తోటి కార్మికులు కేకలు వేసి మట్టిని తొలగించేందుకు ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో జేసీబీ సహాయంతో మట్టిని తొలగించి ఇద్దరినీ బయటకు తీశారు. అప్పటికే స్పృహ లేకపోవడంతో పెంచికలపాడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఇద్దరు మృతి చెందినట్లు తెలపడంతో మృతదేహాలను కోడుమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గూడూరు ఎస్‌ఐ తిమ్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకి సోమన్నకు ముగ్గురు పిల్లలు కాగా, తలారి మధుకు ఏడాది కిందటే వివాహమైంది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘం నాయకులతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *