Ileana: హీరోయిన్ ఇలియానా మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో తన సన్నటి నడుముతో కుర్రకారును ఊపేసిన ఈ అందాల తార, ప్రస్తుతం ముంబైలో తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందిస్తోంది. బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత మరింత బోల్డ్‌గా మాట్లాడుతున్న ఇలియానా, తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
బాడీ ఫిట్నెస్ గురించి ఇలియానా ఏమందంటే..
ఇలియానా ఎప్పుడూ తన శరీర సౌష్ఠవంగురించి మాట్లాడుతుంటుంది. ఫిట్‌గా ఉండేందుకు చాలా కష్టపడాలని, ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాల్సిందేనని ఆమె చెబుతోంది.
ఈ సందర్భంగానే ఆమె ఓ సంచలన వ్యాఖ్య చేసింది. “శరీరానికి వ్యాయామం చాలా అవసరం. కొన్నిసార్లు శృంగారం కూడా మంచి వ్యాయామం లా పనిచేస్తుంది. అందులోనూ మనం అలసిపోతాం కాబట్టి, అది శరీరానికి మంచిదే” అని ఇలియానా చెప్పింది.
మెచ్యూరిటీ లేని ఆలోచనలు!
కష్టపడి చేసే ఏ పనైనా మన శరీరానికి మేలు చేస్తుందని ఆమె వివరించింది. అయితే, తాను ఇలాంటి బోల్డ్ విషయాలు మాట్లాడినప్పుడు కొంతమంది దాన్ని సరైన విధంగా అర్థం చేసుకోలేరని ఇలియానా అభిప్రాయపడింది.
చాలామంది మెటురిటి లేకుండా ఆలోచిస్తున్నారని, పరిణతితో ఆలోచిస్తేనే తాను చెప్పే విషయాలు సరిగ్గా అర్థమవుతాయని ఈ బ్యూటీ పేర్కొంది.
ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాణించిన ఇలియానా.. తన వ్యక్తిగత జీవితం, ఫిట్నెస్ గురించి ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.