ICC Big Shock To Pakistan

ICC Big Shock To Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్… ఐసీసీ చర్యలు?

ICC Big Shock To Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)పై ఐసీసీ (ICC) కఠిన చర్యలు తీసుకుంది. ఆసియా కప్ 2025లో భారత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన వివాదం, దాని పర్యవసానంగా ఈ చర్యలు తీసుకుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కారణమని ఆరోపిస్తూ, అతన్ని టోర్నమెంట్ నుండి తొలగించాలని పీసీబీ ఐసీసీకి, ఏసీసీకి (ఆసియా క్రికెట్ కౌన్సిల్) ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఫిర్యాదును ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ డిమాండ్‌ను తిరస్కరించడంతో, పీసీబీ తమ ఆటగాళ్లు యు.ఎ.ఇ.తో జరిగే మ్యాచ్ కోసం హోటల్ నుండి బయలుదేరవద్దని ఆదేశించింది.

ఇది కూడా చదవాడి: Ameesha Patel: అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు

దీనివల్ల మ్యాచ్ ప్రారంభం ఒక గంట ఆలస్యమైంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పాకిస్తాన్ కెప్టెన్ మరియు కోచ్‌తో సమావేశమయ్యాడు. అయితే, ఈ సమావేశాన్ని పీసీబీ మీడియా మేనేజర్ రికార్డ్ చేశాడు. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫిషియల్స్ ఏరియా (PMOA) లో మొబైల్ ఫోన్లు లేదా కెమెరాలు తీసుకుని వెళ్లడం నిబంధనలకు విరుద్ధం. అయినా, పీసీబీ ఈ నియమాన్ని ఉల్లంఘించింది.ఈ నిబంధనల ఉల్లంఘనపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. పీసీబీకి సస్పెండ్, పదేపదే నిబంధనల ఉల్లంఘన, దుష్ప్రవర్తన అంటూ ఒక ఈ-మెయిల్ పంపింది. పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పారని పీసీబీ పేర్కొన్నప్పటికీ, అతను కేవలం కమ్యూనికేషన్‌లో వచ్చిన లోపంపై విచారం వ్యక్తం చేశాడని ఐసీసీ స్పష్టం చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *