iBomma Ravi:

iBomma Ravi: ఐబొమ్మ రవికి జాబ్ ఆఫ‌ర్.. డీసీపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

iBomma Ravi: తెలుగు ప్ర‌జ‌ల రాబిన్‌హుడ్‌గా అత్య‌ధికులు భావిస్తున్న ఐబొమ్మ ర‌వి (iBomma Ravi)కి పోలీస్ శాఖ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిందంటూ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఆ వార్త‌ల‌పై ఆ శాఖ కీల‌క అధికారి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వాస్త‌వంగా ఐబొమ్మ ర‌వి తెలివి తేట‌ల‌ను ఉప‌యోగించుకునేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని, పోలీస్ శాఖ‌లో ప‌నిచేస్తావా? అంటూ ఆఫ‌ర్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మంచి జీతం ఇస్తామ‌ని కూడా చెప్పార‌ని, దానికి ఐబొమ్మ ర‌వి తిర‌స్క‌రించార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

iBomma Ravi: ఐబొమ్మ ర‌వికి జాబ్ ఆఫ‌ర్ వార్త‌ల‌పై తాజాగా సైబ‌ర్ క్రైం డీసీపీ అర‌వింద్ బాబు స్పందించారు. ఐబొమ్మ ర‌వికి పోలీస్ శాఖ జాబ్ ఆఫ‌ర్ చేసింద‌న్న వార్త‌లు ఫేక్ అని కొట్టిపారేశారు. అది అవాస్త‌వ‌మ‌ని తేల్చి చెప్పారు. 8 రోజుల పోలీస్ క‌స్ట‌డీ స‌మ‌యంలో ర‌వి నుంచి కొన్ని కీల‌క‌మైన విష‌యాల‌ను రాబ‌ట్టామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

iBomma Ravi: త‌ప్పు చేశాన‌న్న బాధ అత‌నిలో అస‌లే లేద‌ని సైబ‌ర్ క్రైం డీసీపీ అర‌వింద్ బాబు తెలిపారు. అత‌ను మూడు బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేసిన‌ట్టు గుర్తించామ‌ని తెలిపారు. ఆర్థిక లావాదేవీల‌పై ఇంకా వివ‌రాల‌ను రాబ‌ట్టాల్సి ఉన్న‌ద‌ని ఆయ‌న తెలిపారు. ర‌వి కేసు మ‌రో ద‌శ‌కు చేరింద‌ని, ఆర్థిక లింకులు ప్ర‌మోష‌న్ నెట్‌వ‌ర్క్‌, లావాదేవీల‌పై పూర్తి వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్టు తెలిపారు.

iBomma Ravi: ఐబొమ్మ ర‌వికి సంబంధించిన కీల‌క ఆదాయ వ‌న‌రులు హైద‌రాబాద్‌, విశాఖప‌ట్నంలో ఉన్న‌ట్టు తాము గుర్తించామ‌ని సైబ‌ర్ క్రైం డీసీపీ అర‌వింద్ బాబు వెల్ల‌డించారు. అత‌నికి అనుబంధంగా ప‌నిచేస్తున్న మిర్ర‌ర్ సైట్ల‌ను పూర్తిగా మూసి ఉంచిన‌ట్టు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బుతో అత‌ను లావిష్ లైఫ్‌స్టైల్‌కు అల‌వాటు ప‌డ్డాడ‌ని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *