Premisthunna: ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో వరలక్ష్మీ పప్పుల సమర్పణలో, కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో దర్శకుడు భాను రూపొందించిన సరికొత్త రొమాంటిక్ చిత్రం ‘ప్రేమిస్తున్నా’. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం యువతను ఆకట్టుకునే ప్రేమకథతో రూపొందింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ‘అరెరె’ అనే ఫస్ట్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు భీమ్స్, దర్శకులు అశోక్.జి, అనుదీప్ కె.వి, భాను బోగవరపు, కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.

Also Read: The Rajasaab: ‘ది రాజాసాబ్’ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్?
Premisthunna: ఈ సందర్భంగా ఐబిఎం మెగా మ్యూజిక్ ఆడియో కంపెనీని ప్రారంభించారు.నిర్మాత కనకదుర్గారావు మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక అనంతమైన ప్రేమకథ అని, యువతను ఆకర్షించే భావోద్వేగ సన్నివేశాలతో నిండి ఉందని తెలిపారు. ‘అరెరె’ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా, అనురాగ్ కులకర్ణి గానం, సిద్ధార్థ్ సాలూరి సంగీతం అందించారు. దర్శకుడు భాను మాట్లాడుతూ, సాత్విక్, ప్రీతి నేహా అద్భుత నటనతో ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.


