Rishab Shetty

Rishab Shetty: కాంతార షూటింగ్‌లో 4సార్లు చనిపోయేవాడిని… దేవుడే నన్ను కాపాడాడు: రిషబ్ శెట్టి

Rishab Shetty: కన్నడ సినిమా ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ విడుదలతో ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో, నటనలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందిన ఈ పాన్-ఇండియా మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతుంది. సెప్టెంబర్ 22న విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది, ప్రభాస్ సోషల్ మీడియాలో లాంచ్ చేసి బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్‌లో రిషబ్ శెట్టి శక్తివంతమైన లుక్, డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో రిషబ్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు షేర్ చేసారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫేక్ పోస్టర్ గురించి స్పందిస్తూ, అది పూర్తిగా నకిలీ అని స్పష్టం చేశారు. ఆ పోస్టర్‌లో సినిమా చూడటానికి వచ్చే వారు మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, పొగ తాగకూడదు అని రాసి ఉంది. ఇది మా ప్రొడక్షన్ హౌస్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఎవరో వైరల్ కోసం తయారు చేశారని రిషబ్ అన్నారు. మా దృష్టికి వచ్చిన వెంటనే ఆ పోస్టర్ తొలగించి క్షమాపణలు చెప్పారని చెప్పారు.

Also Read: Customs Raid: పృథ్వీరాజ్‌, దుల్కర్‌ సల్మాన్‌ ఇంట్లో కస్టమ్స్‌ సోదాలు

షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడుతూ, తనకు 4-5 సార్లు ప్రమాదాలు జరిగాయని రిషబ్ తెలిపారు. అప్పుడు చనిపోయేవాడిని, ఆ దేవుడే తనను కాపాడాడని, ఆయన ఆశీస్సుల వల్లే సినిమా పూర్తయిందని చెప్పారు. టీమ్ అంతా మూడు నెలలు నిరంతరం పని చేసిందని, సరిగ్గా నిద్రపోలేదని వివరించారు. దర్శక బృందం, నిర్మాతలు ప్రతి ఒక్కరూ సొంత సినిమాగా భావించి కష్టపడ్డారని, ఎన్నో సవాళ్లను అధిగమించామని అన్నారు. కొందరు యూనిట్ సభ్యులు అనుకోకుండా మరణించడం కూడా జరిగిందని, అయినా విశ్వాసం, దైవత్వం రక్షణగా నిలిచాయని అన్నారు.

ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ కిరగండూర్ నిర్మాత. ట్రైలర్‌లో చూపించినవి కొన్ని శాంపిల్స్ మాత్రమేనని, అసలు కంటెంట్ సినిమాలో ఉందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టర్ చర్చలు జోరుగా సాగుతున్నాయి, కానీ రిషబ్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ చిత్రం కన్నడ సంస్కృతి, దైవిక అంశాలను ప్రతిబింబిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించేలా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *