RGV: ఇంతకుముందు సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నేడు పోలీసు విచారణకు హాజరు అవుతారని అనుకున్నారు. కాని పోలీసు విచారణకి రాలేనని వాట్సాప్‌లో మెసేజ్ పెట్టిన రాంగోపాల్ వర్మ. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉండటంతో పోలీసు విచారణకు హాజరు కావడానికి వారం రోజులు గడువు కావాలి అని కోరిన వర్మ. దింతో నాలుగు రోజులు గడువు ఇచ్చిన మద్దిపాడు పోలీసులు.గడువు అనంతరం దర్యాప్తునకు సహకరిస్తానని రాంగోపాల్ వర్మ పోలీసులకు తెలిపారు. గతం లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పైన సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుఫోటోలను మార్ఫింగ్ చేసినందుకు ఆర్జీవీపై కేసు నమోదు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: డిఎస్సీ నోటిఫికేషన్‌పై నారా లోకేష్ కీలక ప్రేకటన
ఈ కేసు విషయంలో ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు . అయితే, కోర్టు ఈ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది.