Hydra:హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే కట్టడాలను శనివారం హైడ్రా బృందం కూల్చివేసింది. కూల్చివేసిన కట్టడాల విలువ సుమారు రూ.2,000 వరకు ఉంటుందని అంచనా. వీకెండ్ రోజుల్లోనే హైడ్రా తన పనికానిచ్చేస్తుందన్న నానుడికి ఈ రోజు శనివారం నాడు (ఏప్రిల్ 19) కూల్చివేతలు చేపట్టడం గమనార్హం.
Hydra:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు చెందిన వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన కట్టడాలుగా హైడ్రా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేట, మాదాపూర్ ప్రాంతాల్లోని రూ.2,000కు పైగా విలువైన భూముల్లో ఉన్న ఈ కట్టడాలను కూల్చివేశారు.