Hydra: హైదరాబాద్ నగర పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులోని ఆక్రమణలను గురువారం కూల్చివేసిన హైడ్రా సిబ్బంది.. శుక్రవారం సికింద్రాబాద్‌లోని నాలాలపై నిర్మాణాలను కూల్చివేశారు. కంటోన్మెంట్ పరిధిలోని ప్యాట్నీ నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
Hydra: ఒకరోజు ముందే కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్‌తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను స్వయంగా పరిశీలించారు. పలు నిర్మాణాలతోపాటు ప్యాట్నీ నాలా కుంచించుకుపోయినట్టు వారు గుర్తించారు. భారీ వర్షాల సమయంలో కంటోన్మెంట్ ముంపు భారిన పడుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్యాట్నీ నాలా వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

