Hyderabad: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌కి విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బంద్‌కు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ వి. హనుమంతరావుతో పాటు అనేక బీసీ నాయకులు పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా ఫ్లెక్సీ బ్యానర్ పట్టుకుని ముందుకు నడుస్తున్న వి. హనుమంతరావు ఒక్కసారిగా తడబడి కిందపడ్డారు. వెంటనే సహచర నాయకులు ఆయనను పైకి లేపి సాయం చేశారు. అనంతరం ఆయన మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా సాగింది. పలు ప్రాంతాల్లో వ్యాపారులు, యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. బీసీ సంఘాల నాయకులు ఈ బంద్‌ను చారిత్రాత్మక విజయంగా పేర్కొన్నారు.