Hyderabad: తెలంగాణ హైకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

Hyderabad: తెలంగాణ హైకోర్టులో నూతనంగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ సమక్షంలో జస్టిస్ రేణుకా యారా, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ ఇ. తిరుమలాదేవి, జస్టిస్ బీఆర్ మధుసూదన్ రావులు ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన న్యాయమూర్తుల గత బాధ్యతలు

జస్టిస్ రేణుకా యారా – సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేశారు.

జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు – సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా సేవలందించారు.

జస్టిస్ ఇ. తిరుమలాదేవి – హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మరియు విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించారు.

జస్టిస్ బీఆర్ మధుసూదన్ రావు – హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా సేవలందించారు.

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల స్థితి

తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం 26 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. తాజా నలుగురి నియామకంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య30కి చేరుకుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *