Hyderabad: ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ..

Hyderabad::బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 6న క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ అంశాలపై క్యాబినెట్ సమావేశంలో సీఎం మళ్లీ చర్చించనున్నారు.

మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళలకు లబ్ధి చేకూర్చే కొత్త పథకాలను ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అదే విధంగా, ఈ నెల రెండో వారంలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ అంశాలు ఈ చర్చలో కీలకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఈ బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Road Accident: హైద‌రాబాద్‌లో దారుణం.. ముగ్గురు మైన‌ర్ల‌ను బ‌లిగొన్న ఫ్లైఓవ‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *