Hyderabad: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో పనిచేసిన స్మితా సబర్వాల్‌ను ఇప్పటికే ఘోష్ కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. మూడు బ్యారేజీల నిర్మాణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టంచేశారు. “పర్యవేక్షణ, నాణ్యత అంశాల్లో నా పాత్ర లేదు. సీఎంకు అనుమతి కోసం వచ్చే పత్రాలను పరిశీలించడం, వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడం మాత్రమే నా బాధ్యత” అని ఆమె జవాబిచ్చినట్లు నివేదిక పేర్కొంది.
అలాగే జిల్లాల పర్యటనలకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు తెలియజేయడం మాత్రమే తన పనితీరు పరిధి అని సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లో పేర్కొన్నారు.