Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని తుంగతుర్తిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయిన నేపథ్యంలో, ఇప్పుడు తిరిగి ఈ ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజలకు గూడు కలిగిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పటికే కొంతమందికి రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం, తాజాగా మరో 2.4 లక్షల కార్డులను పంపిణీ చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. దీని ద్వారా సుమారు 11.30 లక్షల మందికి లబ్ధి కలగనుంది.
ఇప్పటి వరకు గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేసింది. తాజా పంపిణీతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల మొత్తం సంఖ్య 94,72,422కు చేరుకోనుంది. వీటి ద్వారా మొత్తం 3.14 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.