Hyderabad: తెల్వని వారిపై కలర్ చల్లితే కటకటాల్లోకే..

Hyderabad: హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవడానికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కొన్ని కఠిన ఆంక్షలను విధించారు. మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటల నుండి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

పోలీసుల ఆంక్షలు:

✅ రోడ్లపై వెళ్లే వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లడం నిషేధం. ఇది చేస్తే కఠిన చర్యలు తప్పవు.

✅ ప్రజాస్థలాల్లో గుంపులుగా ర్యాలీలు, వేడుకలు నిర్వహించొద్దు.

✅ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా మద్యం సేవించి రోడ్లపై హల్‌చల్ చేస్తే కఠిన చర్యలు.

✅ సార్వజనిక ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తారు.

పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. ప్రజలు నియమాలను పాటించి హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలనిసూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *