Hyderabad : నగరంలోని ప్రముఖ పిస్తా హౌస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చోటుచేసుకున్నాయి. నగరవ్యాప్తంగా ఉన్న మొత్తం 25 పిస్తా హౌస్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి, 23 చోట్ల నుంచి ఆహార నమూనాలను సేకరించారు.
తనిఖీల్లో పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, అక్కడ ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నట్లు తేల్చారు. అలాగే, నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు, తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లలో మాంసాన్ని నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు.
అధికారులు ఈ లోపాలపై సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

