Hyderabad News:

Hyderabad News: హైద‌రాబాద్‌లో చెప్పుల దొంగ‌లు ఉన్నారు జాగ్ర‌త్త‌!

Hyderabad News: అవును.. ఇది నిజ‌మేనండి.. ఇండ్లు, కార్యాల‌యాలు, అపార్ట్‌మెంట్లు, ఆల‌యాల్లో.. ఎక్క‌డైనా చెప్పుల‌ను గుండు గుత్త‌గా ఎత్తుకెళ్లే దొంగ‌ల బ్యాచ్‌లు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్నాయి. రేయింబ‌వ‌ళ్లు వారు త‌మ ప‌ని కానిచ్చేస్తుంటారు. రాత్రి పూట అపార్ట్‌మెంట్ల కింద ప‌దుల సంఖ్య‌లో ఉండే జ‌త‌ల చెప్పుల‌ను మూట‌ల‌కు మూట‌లు క‌ట్టేసి, ఆటోల్లో పెట్టేసి.. ఎంచ‌క్కా చెక్కేస్తుంటారు. ఔను ఇది నిజ‌మేనండి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇది ష‌రా మామూలుగా అయింది.

Hyderabad News: హైద‌రాబాద్ న‌గ‌రంలోని మూసారాంబాగ్ ఈస్ట్ ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌లో బూట్లు, చెప్పులను మూట‌ల్లో కొట్టుకొని దొంగ‌లు ఎత్తుకెళ్లిన దొంగ‌ల ఘ‌ట‌న నిన్న అర్ధ‌రాత్రి దాటాక‌ చోటు చేసుకున్నది. అక్క‌డి నాలుగు అపార్ట్‌మెంట్ల‌లో ఓ ఇద్ద‌రు చొర‌బడి బూట్లు, చెప్పుల‌ను ఎత్తుకెళ్లారు. ఓ అపార్ట్‌మెంట్‌లో అయితే మూడు సార్లు మూట‌లుగాను క‌ట్టుకొని ఆటోలో స‌ర‌ద్దుకొని వెళ్లారు.

Hyderabad News: అక్క‌డి ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌, మ‌హిళా ఎస్ఐ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే ఆ అపార్ట్‌మెంట్ కింద ఆ పోలీస్ అధికారులు త‌మకు చెందిన పోలీస్ బూట్ల‌ను, త‌మ చెప్పుల‌ను కింద‌నే ఉంచారు. అయినా దొంగ‌ల‌కు అవి పోలీస్ బూట్లా, కాదా? అనేది తెలియ‌లేదు. త‌మ‌కు కావాల్సింది బూట్లు, చెప్పుల జ‌త‌లు కాబ‌ట్టి ఆ పోలీసుల బూట్లు, చెప్పుల‌ను సైతం ఆ మూట‌లో వేసుకొని పోయారు.

Hyderabad News: ఇంత‌కాలం ఆ చెప్పులే క‌దా.. ఎవ‌రెత్తుకెళ్తారులే.. అని ఇంటి కింద‌, అపార్ట్‌మెంట్ల గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ మూల‌కు ప‌డేసే చెప్పులు, షూస్ ఇక మాయ‌మ‌వ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌. చెప్పులు, బూట్ల‌ను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయి. త‌స్మాత్ జాగ్ర‌త్త‌. ఎవ‌రి చెప్పులు వారు జాగ్ర‌త్త‌గా దాచుకోవాల‌న్న‌మాట‌.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *