Hyderabad: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు.
ఇటీవల కొండా సురేఖపై మేడారం టెండర్ల వివాదం, ఆమె సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, ఆమె ఓఎస్డీ సుమంత్ తొలగింపు, పోలీసుల చర్యలు వంటి పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్ మధ్యవర్తిత్వంతో కొండా సురేఖ దంపతులు ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఓఎస్డీ వ్యవహారంపై ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.