Hyderabad: హైదరాబాద్ నగరం మీదుగా హైస్పీడ్ కారిడార్ ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఇటు ముంబై, అటు బెంగళూరు, చెన్నై నగరాలను హైదరాబాద్ మీదుగా అనుసంధానం చేసే యోచనకు సిద్ధమైంది. ఈ మేరకు రైల్వే శాఖలో మరో ముందడుగు పడినట్టయింది. దీంతో ఈ ప్రాజెక్టు అమలు అయితే హైదరాబాద్ నగరం నుంచి ఆ మూడు నగరాలకు స్వల్పకాలంలోనే ప్రయాణించే వీలు కలుగుతుంది.
Hyderabad: ఇప్పటికే ఢిల్లీ-అహ్మదాబాద్ మధ్య జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్థికసాయంతో హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ రైలు నడువనున్నది. ఇక ముంబై- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వాసులు బుల్లెట్ రైలు ఎక్కే కోరిక రోజులు కొద్దిరోజుల్లోనే తీరనున్నది. హైదరాబాద్ నుంచి ముంబై నగరానికి రెండుగంటల్లోనే వెళ్లే అవకాశం ఉంటుంది.
Hyderabad: దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం జరగనున్నది. ఈ మేరకు 709 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్, ముంబై నగరాలు సమీపం కానున్నాయి. రాకపోకలకు కొద్ది సమయమే పట్టే అవకాశం ఉంటుంది.
Hyderabad: హైదరాబాద్- ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని కూడా రైల్వే శాఖ భావిస్తున్నది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తున్నది. అదే జరిగితే హైదరాబాద్ నగరం నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణం గంటల్లోకి తగ్గిపోతుంది.