Medchal: మేడ్చల్ జిల్లా, పోచారం ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పోచారం ఐటీ కారిడార్ పరిధిలో సోనుసింగ్ అనే వ్యక్తిపై ఓ దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో గాయపడిన సోనుసింగ్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు దర్యాప్తులో కాల్పులు జరిపిన నిందితుడిని ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడు పరారీలో ఉండటంతో, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, ఈ కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన పూర్వాపరాల గురించి మరింత సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.