Hyderabad: గుడ్ న్యూస్.. ఆర్టీసి బస్సులో యూపీఐ సేవలు .

Hyderabad: హైదరాబాద్ నగరంలో రోజూ లక్షలాది మంది ప్రయాణికులు సిటీ ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తారు. ఈ ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. బస్సులలో చిల్లర సమస్యకు చెక్ పెడుతూ, సులభమైన డిజిటల్ లావాదేవీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా టికెట్ సదుపాయం

ఇప్పటి వరకు నగదు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండగా, ఇప్పుడు సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు యూపీఐ (UPI) పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా చిల్లర సమస్య నుంచి విముక్తి లభించడంతో పాటు, వేచి ఉండే ఇబ్బందులు లేకుండా వెంటనే టికెట్ పొందే అవకాశం ఉంటుంది.

ఆర్టీసీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్

ఆర్టీసీ తాజాగా ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFC) ద్వారా ప్రయాణీకుల టికెటింగ్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్ చేయబడుతోంది. ఈ విధానం ద్వారా బస్సు డ్రైవర్లు, కండక్టర్లపై భారం తగ్గడంతో పాటు, ఆర్టీసీ ఆదాయంలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

త్వరలో మరిన్ని ఆన్లైన్ సేవలు

ఈ కొత్త టికెటింగ్ విధానం తొలి దశలో నగరంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో ప్రారంభించబడింది. ప్రయాణికుల స్పందనను ఆధారంగా చేసుకుని త్వరలోనే మరిన్ని ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ పేమెంట్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది.

హైదరాబాద్ నగర రవాణా సేవల్లో ఇది ఒక పెద్ద మార్పుగా నిలుస్తుందని, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుందని అధికారులు తెలిపారు. త్వరలోనే ఇతర మెట్రో నగరాల్లో కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేసే అవకాశముంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *