Winter Season

Winter Season: చలికాలంలో దుప్పటి కప్పుకుంటున్నారా..? అయితే గుండెపోటు..?

Winter Season: చలికాలం మొదలైంది. ఈ చలిలో వెచ్చగా నిద్రపోదాం అనిపిస్తుంది. చలిలో శరీరాన్ని రక్షించుకోవడానికి చాలా మంది దుప్పట్లు, వెచ్చని స్వెటర్లను ఉపయోగిస్తారు. కానీ కొందరికి రాత్రి పడుకునేటప్పుడు తల నుంచి పాదాల వరకు బెడ్ షీట్ కప్పుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా పడుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఇలా కప్పుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మానికి హానికరం :
చలికాలంలో ముఖంపై బెడ్‌షీట్‌ వేసుకుని పడుకోవడం వల్ల లోపలి అపరిశుభ్రమైన గాలి బయటకు వెళ్లదు. ఈ చెడు గాలి చర్మం రంగు మారడానికి కారణమవుతుంది. ముడతలు, మొటిమలు సహా ఇతర చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తుల సమస్య:
Winter Season: ముఖానికి దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల ఊపిరితిత్తులకు గాలి అందదు. దీని వల్ల ఊపిరితిత్తులు సంకోచించబడతాయి. ఇలాంటి అలవాటు వల్ల క్రమంగా తలనొప్పి, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: America: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన కేటుగాడు..

రక్త ప్రసరణను ప్రభావితం :
Winter Season: దుప్పటితో నిద్రించడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. శరీరంలోని ప్రతి రక్తం సరైన మోతాదులో ప్రవహించదు.ముఖం మీద దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఆక్సిజన్ సరిగా అందదు. దీనివల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. అంతే కాకుండా తలనొప్పి, వికారం, తల తిరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

జుట్టు రాలే సమస్య:
Winter Season: తలపై దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.తల నుండి కాలి వరకు దుప్పట్లు ధరించి నిద్రించే అలవాటు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. శరీరం చెమటలు పడుతుంది. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు.

గుండెపోటు :
తల నుంచి కాలి వరకు దుప్పటి కప్పుకుని పడుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. దీంతో గుండెపోటు, శ్వాసకోశ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: డేంజర్ లో ఢిల్లీ జనాలు ఉక్కిరిబిక్కిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *