Cyber Crime

Cyber Crime: సైబర్‌ క్రైమ్ సంచలనం.. నేటినుంచి ఐ-బొమ్మ, బప్పం టీవీ సైట్లు మూసివేత

Cyber Crime: హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు సినీ పరిశ్రమకు ఊరట కలిగించే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో కొత్త సినిమాలను పైరసీ విడుదల చేసే ప్రముఖ వెబ్‌సైట్లు ఐ-బొమ్మ, బప్పం టీవీలను శాశ్వతంగా మూసివేశారు. ఈ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత, ఈ సైట్లను సృష్టించిన రవి చేతులతోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయించారు. దీంతో ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారిన ఈ పైరసీ సామ్రాజ్యానికి పూర్తిగా తెరపడింది.

రవి నివాసంలో కోట్ల నగదు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం
నిందితుడు ఇమ్మడి రవి గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్‌మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా రూ. 3 కోట్ల నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్‌కు చెందిన రవి, టెక్నాలజీ విషయంలో గొప్ప నైపుణ్యం ఉన్న వ్యక్తిగా గుర్తించారు.

హ్యాకింగ్‌లో రవి టాలెంట్.. క్లౌడ్ ఫ్లేర్‌ను కూడా వదల్లేదు!
రవికి ప్రపంచంలో ఎలాంటి సర్వర్ ఐనా, ఎంత భద్రంగా ఉన్నా ఈజీగా హ్యాక్ చేయగలిగే ట్యాలెంట్ ఉంది. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్ ను సైతం ఇతను హ్యాక్ చేశాడు. కొత్త సినిమాలను అక్రమంగా డౌన్‌లోడ్ చేసి, కరేబియన్ దీవులను తన అడ్డగా చేసుకుని, అక్కడ నుండి i-bomma వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవాడు. కేవలం ఐ-బొమ్మే కాదు, 70కి పైగా మిర్రర్ సైట్లు కూడా నడుపుతున్నట్లు గుర్తించారు. IBomma, bappam, IRadha వంటి పేర్లతో ప్రధాన వెబ్‌సైట్లు ఉండేవని పోలీసులు తెలిపారు.

ఎలా పని చేసేవాడు? దేశవ్యాప్తంగా నెట్‌వర్క్..
రవికి దేశవ్యాప్తంగా ఒక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సినిమా నిర్మాతలు, విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలను కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు ఇస్తారు. ఆ సంస్థలు, సినిమాను విడుదల చేయడానికి థియేటర్లకు సాటిలైట్ ద్వారా చేరవేస్తాయి. రవి తన టెక్నాలజీ నైపుణ్యంతో ఈ ప్రక్రియలోనే చొరబడి, సినిమా కాపీలను దొంగిలించి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేవాడని తెలుస్తోంది. ఈ అరెస్ట్‌తో, సినిమా పైరసీకి వ్యతిరేకంగా హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ముందుండి పోరాడారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *