Condom: ఓహో.. న్యూ ఇయర్ రోజు మందు కన్న.. కండోమ్స్ ఎక్కువ వాడారు..

Condom: అప్పటి జమాన్ల కండోమ్ కొనాలంటే చాలామంది వందసార్లు ఆలోచించేవారు. ఎవరేమనుకుంటారో అని భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కండోమ్‌లు ఆన్‌లైన్‌లోనూ, మొబైల్ యాప్‌లలోనూ సులభంగా ఆర్డర్ చేస్తూ ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఇది సాధారణమైంది. అయితే, నూతన సంవత్సరానికి ముందురోజు మాత్రం కండోమ్‌లకు విపరీతమైన డిమాండ్ కనిపించింది.

ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్క హైదరాబాద్‌లోనే 10,000కు పైగా కండోమ్ ఆర్డర్లు వచ్చినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా కండోమ్‌ల అమ్మకాలు భారీగా పెరిగాయి. జనవరి 1ను స్వాగతించేందుకు ముందురోజు ఈ తరహా వినియోగం ఎందుకు పెరుగుతుందన్న అంశంపై చర్చ జరుగుతోంది.

కండోమ్‌లతో పాటు ద్రాక్షపండ్లు, ఐస్‌క్రీమ్లు, సాఫ్ట్‌డ్రింక్స్ వంటి వాటికి కూడా భారీగా ఆర్డర్లు వచ్చినట్లు గుర్తించారు. ఇంట్లోనే పార్టీలు చేసుకునే వారు ఈ రకాల వస్తువులను పెద్దఎత్తున కొనుగోలు చేశారు. స్విగ్గీతో పాటు బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ యాప్స్‌లో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. లిక్కర్ పార్టీల కారణంగా చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, ఇతర స్నాక్స్‌కు డిమాండ్ పెరిగింది.

మద్యం సేవించే సమయంలో పచ్చడి వంటి వస్తువులను మంచింగ్ కోసం వాడేవారు. ఇప్పుడు ఈ అలవాట్లు మారాయి. చిప్స్, ఆలూ భుజియా, ఇతర స్నాక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల సమయానికి బ్లింకిట్‌లో 2.3 లక్షల ఆలూ భుజియా ప్యాకెట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో స్విగ్గీ యాప్‌లో నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్లు బుక్ అవడం గమనార్హం.

ఇక పాలు, చాక్లెట్, ద్రాక్ష, పనీర్ వంటి ఆహార పదార్థాలకు కూడా అధిక ఆర్డర్లు వచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నూతన సంవత్సర వేళ ఇదే మూడ్ కొనసాగింది.

ఈ డిమాండ్ మార్పులు భారతీయుల జీవితశైలిలో వచ్చిన ఆధునికత, సౌలభ్యం, మరియు మారుతున్న ప్రాధాన్యాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Saudi Arabia: చరిత్రలోనే తొలిసారి... ఎడారిలో మంచు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *