Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్న మూవీని క్రిష్ డైరెక్ట్ చేయగా, దానిని పూర్తి చేసే బాధ్యతను ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ భుజానికెత్తుకున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ఐదు భారతీయ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం కోసం కీరవాణి స్వరరచన చేయగా ‘మాట వినాలి’ అనే గీతాన్ని పవన్ కళ్యాణ్ పాడారు. ఈ సాంగ్ ను జనవరి 6న విడుదల చేయబోతున్నారు. ఎ. ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటిచిత్రం ఇదే!
ఐదు రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేసిన ‘మార్కో
Marco: ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ సినిమా మలయాళ, హిందీ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తొలి ఐదు రోజుల్లే ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జనవరి 1న తెలుగులో దీనిని ఎన్.వి.ఆర్. సినిమా సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు ఉన్ని ముకుందన్.
ఇది కూడా చదవండి: Condom: ఓహో.. న్యూ ఇయర్ రోజు మందు కన్న.. కండోమ్స్ ఎక్కువ వాడారు..
Marco: అతను నటించి వయొలెంట్ మూవీ ‘మార్కో’ను హనీఫ్ అదేని డైరెక్ట్ చేశారు. షరీఫ్ ముహమ్మద్ దీనిని నిర్మించారు. నాగ శౌర్య ‘రంగబలి’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన యుక్తి తరేజా కబీర్ దుహన్ ‘మార్కో’లో కీలక పాత్రలు పోషించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. మరి మలయాళ చిత్రసీమలో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న ‘మార్కో’ని తెలుగువారు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.