Game Changer: జనవరి 1న వస్తుందని అనుకున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ఒక రోజు ఆలస్యంగా రాబోతోంది. జనవరి 2వ తేదీన థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు ‘దిల్’ రాజు తెలిపారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పవర్ పాత్రలలో కనిపించబోతున్నారు. అందులో ఒకటి ఐఎఎస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి సమాజసేవకుని పాత్ర. కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఎస్.జె. సూర్య, సముతిర కతి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలను పోషించారు.
ఇది కూడా చదవండి: Sai Pallavi: పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో నటి సాయి పల్లవి
Game Changer: తమన్ స్వరాలు అందించిన నాలుగు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. వీటికి ప్రభుదేవా, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ నృత్యరీతులు సమకూర్చారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తమిళంలో ఎన్వీసీ, ఆదిత్యారామ్ మూవీస్ దీనిని విడుదల చేస్తుండగా, హిందీలో అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు.