Deepak Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి మంగళవారం (అక్టోబర్ 21) తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తదితర బీజేపీ నేతలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
విజయదుర్గ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అక్కడి నుంచి బీజేపీ శ్రేణులు షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే దీపక్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. దీపక్‌రెడ్డి బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా 130కి పైగా నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం.