Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి మైనర్ అయిన బాలికను ఆటోలో కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి యత్నించగా, ఆ బాలిక చాకచక్యంగా తప్పించుకోవడంతో ముప్పు తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ నగర నడిబొడ్డున చార్ కమాన్ ప్రాంతంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.
Hyderabad: హైదరాబాద్ చార్ కమాన్ ప్రాంతం పరిధిలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో సుల్తాన్ షాహీ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి చదువుకుంటున్నది. సాయంత్రం స్కూల్ అయిపోగానే ఆ బాలిక స్కూల్ బయటకు వచ్చింది. వచ్చీరాగానే గుర్తుపట్టినట్టుగా, ఆ బాలిక వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. మీ నాన్న నిన్ను తీసుకురావాలని ఆటో పంపించాడు… అని చెప్పి నమ్మబలికాడు.
Hyderabad: నిజమేనని నమ్మిన ఆ బాలిక ఆ ఆటోలో ఎక్కి కూర్చున్నది. ఆ బాలిక ఎక్కిన ఆటో తన ఇల్లు ఉన్న సుల్తాన్ షాహీ ప్రాంతం వైపు కాకుండా, మలక్పేట వైపు వెళ్తుండగా, ఆ బాలికకు అనుమానం కలిగింది. ఈలోగా ఆ బాలికతో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేకపోయింది. ఈ లోగా ఓ సిగ్నల్ రాగానే చాకచక్యంగా ఆ బాలిక ఆటో నుంచి దూకి, కేకలు వేసింది.
Hyderabad: ఆ బాలిక కేకలు విన్న స్థానికులు, వాహనదారులు ఆ ఆటోలో ఉన్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో ఆ బాలిక ఆ దుర్మార్గుడి చెర నుంచి వీడిపోయింది. కానీ, ఇలా ఎందరో బాలికలు మోసపోతున్నట్టు పోలీసుల రికార్డులే చెప్తున్నాయి. వారి వద్దకు వచ్చే మిస్సింగ్ కేసులో సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులతోపాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నది.