Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేసింది. ఈ క్రమంలో ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రాజిరెడ్డి కొత్త చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా శృతి ఓజా నియమితులయ్యారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య బాధ్యతలు స్వీకరించగా, హెచ్‌ఎండీఏ (HMDA) సెక్రటరీగా కోటా శ్రీవత్స బదిలీ అయ్యారు.