Hrithik Roshan: యశ్ రాజ్ ఫిలిమ్స్ ఆలియాభట్, శర్వరీ కాంబోలో రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. రాహుల్ రవైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. మహిళా గూఢచారులుగా ఆలియా భట్, శర్వరీ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అతిథిగా మెరవబోతున్నాడట. ఇక ఇది యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో తొలి క్రాస్ ఓవర్ సినిమా. హృతిక్, ఆలియా భట్, శర్వరీతో నవంబర్ 9 నుంచి షూటింగ్ చేయనున్నారు. ఆలియా, శర్వరీలు గురువుగా హృతిక్ ఇందులో కనిపిస్తాడట.
ఇది కూడా చదవండి: Rashmika Mandanna: ‘స్త్రీ2’ మేకర్స్ తో రశ్మిక హారర్ చిత్రం ‘ధామ’!
ఆదిత్య చోప్రా, శివ రవైల్ తీస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 11 రోజుల పాటు హృతిక్ షూటింగ్ లో పాల్గొన బోతున్నాడట. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ స్పై యూనివర్స్ లో ‘ఆల్ఫా’, వార్2 నిర్మాణంలో ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ తో కలసి ఎన్టీఆర్ నటించిన ‘వార్2’ వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. ‘ఆల్ఫా’ను 2025 క్రిస్మస్ కి విడుదల చేస్తారట. మరి హృతిక్ పోషించే గురు పాత్ర ‘ఆల్ఫా’ విజయంలో ఏ మేరకు సాయపడుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది క్రిస్మస్ వరకూ ఆగాల్సిందే.