Telangana: మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నది. వైశాల్యం, జనాభా రీత్యా తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఇక్కడి జనమే అధిక మొత్తంలో మద్యం కొనేస్తున్నట్టు ఓ జాతీయ సంస్థ సర్వేలో తేలింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పీ) అంచనా ప్రకారం తెలంగాణలో సగటున గతేడాది ఒక్కొక్కరు రూ.1,623 రూపాయలను మద్యం కోసం ఖర్చు చేసినట్టు వెల్లడైంది. ఇది దేశంలోనే అత్యధికం అని తేల్చింది.
Telangana: తెలంగాణ తర్వాత దక్షిణాదిలో ఏపీలో మద్యం అమ్మకాలు అత్యధికంగా సాగినట్టు ఎన్ఐపీఎఫ్‌పీ సంస్థ అంచనా వేసింది. ఆ రాష్ట్రంలో గతేడాది సగటున 1306 రూపాయలను ఖర్చు చేసినట్టు తెలిపింది. అదే వరుసన పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 చొప్పున ఒక్కో వ్యక్తి ఖర్చు చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యక్తులు మద్యం కోసం తక్కువగా ఖర్చు చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.
Telangana: తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా, మరో 1,000 వరకు బార్లు, పబ్‌లు ఉన్నాయి. ఇటీవల దసరా సందర్భంగానే రాష్ట్రంలో సుమారు రూ.1,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ సమయంలో 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగినట్టు అంచనా. దక్షిణాదిన తెలంగాణలోనే అత్యధిక బీర్లు అమ్ముడవుతున్నట్టు ఆ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలల మధ్యన 302.84 లక్షల మంది బీర్లు తాగినట్టు అంచనా.
Telangana: మద్యం అమ్మకాలతో తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఏటేటా ఆ ఆదాయం కూడా పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వాలు కూడా పెంచుకుంటూ పోతున్నాయి. ప్రతిరోజూ లక్షలాది లీటర్ల మద్యం తెలంగాణలో అమ్ముడవుతున్నది. ఏపీలో కూడా భారీగానే అమ్మకాలు ఉన్నాయని తేలింది. 169 లక్షల బీర్లు అమ్ముడైనట్టు ఆ సంస్థ సర్వేలో తేల్చింది. ఇదన్న మాట. మద్యం తాగుడులో మన తెలుగోళ్లే ఘనులన్నమాట.