Pensions: ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమయింది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది. పలువురు ప్రజాప్రతినిధులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబరు 1వ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ జరగనుంది. వృద్ధులకు, వితంతులకు నాలుగువేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.రాష్ట్రంలో మొత్తం 64.14 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు వున్నారు. ఇప్పటివరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందజేశారు. ఈనెల పింఛన్‌దారులకు రూ.2,710 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: AP Free Gas Scheme: నేడు శ్రీకాకుళంలో దీపం పథకం ప్రారంభం