Nellore Fish Pulusu: నెల్లూరు చేపల పులుసు పేరు వింటేనే నోరు నోరూరిపోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వంటకాలలో ప్రత్యేక స్థానం పొందిన వంటకం. ఇంట్లో సులభంగా అచ్చమైన నెల్లూరు చేపల పులుసును ఎలా ఇంట్లోనే తయారు చేయాలో తెలుసుకుందామా.
ఈ పులుసు ప్రత్యేకత ఏమంటే, అందులో అల్లం, వెల్లుల్లి, గరం మసాలాలు ఉపయోగించరు. ఈ కారణంగా రుచి ఎంతో సహజంగా, కమ్మగా ఉంటుంది. చేప ముక్కలకు తగిన మసాలాలతో పాటు, చింతపండు పులుపు, పచ్చి మామిడి, టమోటాలు కూడా వంటకానికి తీపి, పులుపు రుచి అందిస్తాయి.
తయారీకి కావలసిన పదార్థాలు:
- చేప ముక్కలు – 1 కేజీ
- ఉప్పు, కారం, పసుపు – తగిన మోతాదులో
- నిమ్మరసం – శుభ్రపరిచేందుకు
- ధనియాల పొడి – కొద్దిగా
పులుసు మసాలా కోసం:
- ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు – తక్కువ మోతాదులో
- ఎండుమిర్చి – 1-2 (ఐచ్చికం)
ఇతర పదార్థాలు:
- చింతపండు – 50-80 గ్రాములు
- ఉల్లిపాయలు – 2 (పెద్దవి)
- పచ్చిమిర్చి – 4-5
- పచ్చిమామిడికాయ – 1
- టమాటా – 1
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
- నూనె – 4-5 టేబుల్ స్పూన్లు (నువ్వుల నూనె అయితే ఇంకా బావుంటుంది)
- కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
- పసుపు, ఉప్పు, కారం – రుచికి తగినంత
Also Read: Garlic Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
చేపల పులుసు తయారీ విధానం:
- చేపలను సిద్ధం చేయండి:
చేప ముక్కలను ఉప్పు, నిమ్మరసం తో శుభ్రంగా కడిగి, కారం, పసుపు, ధనియాల పొడి వేసి అరగంట పాటు పెట్టుకోవాలి. - పులుసు మసాలా తయారీ:
ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి మంటపై వేయించి చల్లారాక మిక్సీలో పొడి చేసుకోవాలి. - చింతపండు రసం తీయడం:
చింతపండును కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టి గుజ్జు చేసి రసం తీసుకోవాలి. - పులుసు తయారీ:
వెడల్పాటి గిన్నెలో నూనె వేసి, పోపు దినుసులు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.
తర్వాత టమాటా, మామిడికాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వండాలి.
ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసి కలిపిన తర్వాత చింతపండు రసం పోసి 10-15 నిమిషాలు ఉడికించాలి. - చేప ముక్కలు వేసి ఉడకబెట్టడం:
పులుసు మరిగిన తర్వాత మెల్లగా చేప ముక్కలు వేసి గరిటెతో కలపకుండా మంట తక్కువ చేసి ఉడికించాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత పైన నూనె తేలుతుంది. - చివరగా మసాలా పొడి & కొత్తిమీర:
చివరగా మసాలా పొడి వేసి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
చిట్కా:
Nellore Fish Pulusu: ఈ చేపల పులుసును వండిన వెంటనే తినే బదులు, 3-4 గంటలు తర్వాత తింటే రుచి బాగా బలంగా తెలుస్తుంది. మరుసటి రోజు అయితే ఇంకా రుచిగా ఉంటుంది. మట్టి కుండలో వండి, వడిలో వడ్డిస్తే సంప్రదాయ రుచి మరింతగా పొందవచ్చు.
నేటి రోజుల్లో వేరే విధానాల్లో ఈ వంటకం చేసినా, అసలైన నెల్లూరు స్టైల్ మాత్రం మసాలా పొడి, చింతపండు, మామిడి రుచి తప్ప మరేం కాదు. గరం మసాలా లేకుండా సింపుల్గానూ, అంతే రుచిగా ఉండే ఈ వంటకాన్ని తప్పక ఇంట్లో ఒకసారి ప్రయత్నించి చూడండి.