Curry Leaves for Cholesterol: అధిక కొలెస్ట్రాల్ యువతలో వేగంగా వ్యాపిస్తున్న సమస్య. కొలెస్ట్రాల్ రెండు రకాలు, ఒకటి మంచి కొలెస్ట్రాల్, దీనిని HDL కొలెస్ట్రాల్ అంటారు, మరొకటి LDL కొలెస్ట్రాల్, దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. కొన్ని ఆహారాల నుండి కూడా లభిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ సాధారణంగా ధమనులలో పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగినప్పుడు, అది ధమనుల గోడలపై పేరుకుపోతుంది. ధమనుల అడ్డంకి కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్‌ల ప్రమాదం పెరుగుతుంది.
గుండెను సహజంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఇవి తప్పక తినాల్సిందే. కరివేపాకు అనేక వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతోంది. కరివేపాకు మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Maha Shivaratri 2025: ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఎందుకు? అదే రూపంలో మహాదేవుని ఎందుకు పూజిస్తారు?
కరివేపాకు అనేది విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి మరియు విటమిన్ ఇ లతో సమృద్ధిగా ఉండే ఔషధ మూలిక. ఇందులో ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఐరన్ , ఫైబర్ కూడా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆకు ఎముకలను బలోపేతం చేయడంలో అద్భుత ప్రభావాన్ని చూపుతుంది. కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి తగినంత పోషణ లభిస్తుంది.
కరివేపాకు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవి జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి ఈ ఆకులు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ప్రతిరోజూ కరివేపాకు తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.