Nimmala ramanaidu: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ కన్నీళ్లు కార్చినట్టు నటించడం తగదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పెద్దిరెడ్డి, జగన్‌లకు బనకచర్లపై మాట్లాడే అర్హత లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనుల్లో వైసీపీ ప్రభుత్వం ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదని, అసలు తట్ట మట్టికూడా తీయలేదని మండిపడ్డారు.
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వల్లే గాలేరు-నగరి ప్రాజెక్ట్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) రూ.100 కోట్ల జరిమానా విధించిందని పేర్కొన్నారు. “రప్పా రప్పా అంటూ తిప్పితే.. ఒక్క సీటు కూడా మిగలదు” అంటూ వైసీపీకి హెచ్చరికల వర్షం కురిపించారు. పోలవరం ప్రాజెక్టును 2027 చివరికి పూర్తి చేస్తామని నిమ్మల స్పష్టం చేశారు.