Horoscope

Horoscope: రాశిఫలాలు: ఈ రాశులకు ధనయోగం, మరికొందరికి ఆటంకాలు!

Horoscope: మంగళవారం, జూలై 15, 2025, మేష రాశి నుండి మీన రాశి వరకు ఉన్న 12 రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థిక స్థితి, ఉద్యోగ రంగం, వ్యక్తిగత జీవితంపై నక్షత్రాల ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయ వృద్ధికి అనుకూలం. ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. శుభవార్త వింటారు, డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రారంభించే పనుల్లో ఉత్సాహంగా ఉంటారు, అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఇష్టదేవతా స్తోత్రం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది. పనిభారం ఎక్కువగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులకు ఇది సరైన సమయం. మానసిక సంతృప్తి లభిస్తుంది. అదనపు బాధ్యతలు, పని ఒత్తిడి ఉండవచ్చు. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మీదేవి సందర్శనం వల్ల మేలు.

Also Read: Kidney Failure: మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. డబ్బు అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇష్టదేవత సందర్శనం ఉత్తమం.

ALSO READ  Brahmotsavam 2024: వేంకటేశుని వైభవం.. బ్రహ్మోత్సవ సంబరం.. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయం మేలు చేస్తుంది. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శక్తిని ఇస్తుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. పనిభారం ఉండవచ్చు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. కొన్ని విషయాల్లో మాట పడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తే మంచిది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *