Horoscope

Horoscope: రాశిఫలాలు: కొందరికి ధనలాభం, కొందరికి శుభవార్తలు..!

Horoscope:

మేషం: 
పనులు మొదలుపెట్టినప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా, వాటిని ధైర్యంగా అధిగమిస్తారు. మీ సంబంధాలు, బంధుత్వాలను బలోపేతం చేసుకోవడం చాలా అవసరం. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కష్టాలు తొలగిపోవాలంటే, విష్ణు సహస్రనామ పారాయణ లేదా అష్టలక్ష్మీ స్తోత్రం చదవడం మంచిది.

వృషభం: 
బలమైన మనోధైర్యంతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం శుభప్రదం. వృత్తి, వ్యాపారాల్లో పనిభారం పెరిగినా, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.

మిథునం: 
వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు. ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా దూసుకుపోతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. హనుమాన్ స్వామిని ఆరాధించడం శుభకరం.

కర్కాటకం: 
మీరు మొదలుపెట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగం మారడానికి లేదా పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. గణనాయకాష్టకం చదవడం మంచిది.

సింహం: 
అభివృద్ధికి సంబంధించిన మంచి కబురు వింటారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల మాట వింటే మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని సందర్శించడం ఉత్తమం. వృత్తి జీవితం ప్రశాంతంగా ఉన్నా, వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఎదురుచూస్తున్న శుభవార్త అందుతుంది.

కన్య: 
మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నాయి. బంధువులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఉద్యోగంలో పెద్ద లక్ష్యాలను కూడా సులభంగా పూర్తి చేసి, అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. శ్రీ గణపతి ఆరాధన మరింత మంచి ఫలితాలను ఇస్తుంది.

 తుల:
ఈ రోజు మీకు అదృష్టం తోడవుతుంది. మీ రంగంలో మంచి జరుగుతుంది. కొన్ని విషయాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త మార్గాల్లో పురోగమిస్తాయి. శివారాధన శ్రేయస్కరం.

వృశ్చికం: 
మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో అందరినీ ఆకర్షిస్తారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్కరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనుస్సు:
పెద్దల సహకారం లభిస్తుంది. పనులలో అడ్డంకులు ఉన్నా, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముందు జాగ్రత్త లేకపోతే అనవసర ఖర్చులు వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పిత్రార్జితం లభించే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మకరం: 
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

కుంభం: 
అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రుల సలహాలు, సూచనలు పాటించకపోతే ఇబ్బంది పడతారు. ప్రణాళిక లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలసటగా అనిపిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినా, మంచి ఫలితం ఉంటుంది. శివారాధన చేస్తే మంచిది.

మీనం: 
మీకు మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనులలో ఆటంకాలు ఎదురైనా, మీ బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. చిన్నపాటి సమస్యలు ఉన్నా, వాటిని మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. దుర్గాష్టకం చదివితే మంచిది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *