Horoscope Today

Horoscope Today: ఈ రాశి వారికి ప్రతి పనిలో ఒత్తిడి పెరుగుతుంది.. జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం

Horoscope Today:

మేషం
మీరు మొదలు పెట్టిన పనులు ఒకదాని తరువాత ఒకటి సాఫీగా పూర్తవుతాయి. ఊహించని శుభవార్త మీ ముఖంపై చిరునవ్వు తెప్పిస్తుంది. ఈ రోజు విందులు, వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దగ్గరి వారితో కలసి గడపడం మిమ్మల్ని ఆనందపరుస్తుంది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు కొత్త శుభాలను తెస్తాయి.

వృషభం
మీ కుటుంబం మీకు అండగా నిలుస్తుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలు సులువుగా చేరుకోగలుగుతారు. ఈ రోజు దైవబలం మీ వెంటే ఉంటుంది. ఇష్టదేవుని పేరు జపిస్తే మీలో ఒక కొత్త శక్తి ఉప్పొంగుతుంది.

మిథునం
వృత్తి లేదా వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో నడుస్తాయి. చిన్న క్లిష్టతలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే విజయమే మీది. దుర్గాదేవిని స్మరించండి, మీలోని నమ్మకం మరింత పెరుగుతుంది.

కర్కాటకం
మీ పట్టుదలే మీకు విజయాన్ని తెస్తుంది. అయితే ఆందోళన కలిగించే విషయాలను దూరంగా పెట్టడం మంచిది. ప్రశాంతంగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠనం మీ మనసుకు శాంతి ఇస్తుంది.

సింహం
మీ ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు. అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. బంధుమిత్రుల ద్వారా అనుకోని మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం మీకు శక్తి, విజయాలను అందిస్తుంది.

కన్యా
ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కొత్త ప్రణాళికలు ఫలించబోతున్నాయి. దుర్గాదేవి ధ్యానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ యుద్ధం నేనే ఆపా

తులా
మీ ఆత్మవిశ్వాసమే మీకు రక్షణ. మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో లాభం చేకూరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మనసు తేలిక అవుతుంది. శ్రీలక్ష్మీదేవిని స్మరించడం ఆర్థిక శుభాలను అందిస్తుంది.

వృశ్చికం
మీ కష్టానికి ఫలితం రావాలంటే కొంత అదనపు శ్రమ అవసరం. ఆర్థిక ఖర్చులను కంట్రోల్‌లో పెట్టడం మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా ఉండండి. గణపతి స్తోత్రం చదవడం ద్వారా ఆటంకాలు తొలగుతాయి.

ధనుస్సు
మీ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాయి. మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. సౌభాగ్యం మీవైపు వస్తుంది. ఇష్టదేవుని స్తోత్రం చదవడం ద్వారా మరింత శాంతి, ఆనందం పొందుతారు.

మకరం
ఈ రోజు మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలి. సందేహాలు, ఆలస్యాలు మీ ప్రగతిని తగ్గిస్తాయి. కుటుంబ సభ్యులతో సున్నితంగా మాట్లాడండి. ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చినా ఓర్పు కోల్పోవద్దు. శివారాధన మీకు శుభప్రదం.

కుంభం
మీ శ్రమకు న్యాయం జరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సమయం గడపడం ఆనందం ఇస్తుంది. కొత్త పనులకు మంచి ప్లానింగ్ చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయం పఠనం మీలో మానసిక బలం పెంచుతుంది.

మీనం
ఉద్యోగం, వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. కొన్ని సంఘటనలు మనసును కలచవచ్చూ, కానీ మీరు అధైర్యం చెందకండి. ధైర్యంగా ముందుకు సాగితే శుభఫలితాలు తప్పకుండా వస్తాయి. దుర్గాదేవిని స్మరించడం మీలో నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *