HMPV Virus: కర్ణాటకలో హెచ్‌ఎంబీవీ వ్యాప్తిపై భయాందోళనలు నెలకొన్నాయి. కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొరికిందే సందు అని ప్రయివేట్ ఆసుపత్రులు చెల్లరేగిపోతున్నాయి. దగ్గు, జలుబు అని ఎవరైనా ఆసుపత్రికి వస్తే చాలు వైరస్ టెస్టులు చేయాల్సిందే. అది తప్పనిసరి అని చెబుతున్నారు. అంతేకాదు ఆసుపత్రిలో ఇతర చికిత్సల కోసం వచ్చేవారిని కూడా ఈ వైరస్ పరీక్ష తప్పనిసరి అని చెప్పి ఇబ్బంది పెడ్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో హెచ్‌ఎంపీవీ పరీక్షకు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రయివేట్ ఆసుపత్రులపై రివ్యూ మొదలు పెట్టింది.
ఇది కూడా చదవండి: KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్.. అరెస్టుపై ఉత్కంఠ?
HMPV Virus: ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులు మాట్లాడుతూ..ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఎంపీవీ పరీక్షలు చేయడం లేదు. ఇది తప్పనిసరి కాదు. ఈ వైరస్ ప్రమాదకరం కాదు. జాగ్రత్తగా ఉంటె సరిపోతుంది అని చెబుతున్నారు. మీరు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు రుమాలు ఉపయోగించండి. మీ చేతులను ఎప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది అంటూ వారు సూచిస్తున్నారు.
అంతేకాకుండా జ్వరం, దగ్గు ఉంటే బయటికి వెళ్లవద్దని చెబుతున్నారు. వేడి నీరు త్రాగాలి. పౌష్టికాహారం తినండి. పరిస్థితి ప్రభావితమైతే, వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స పొందండి అంటూ వైద్య అధికారులు సూచిస్తున్నారు.