Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా, ఇండియా బ్లాక్ పార్టీల మధ్య తగవులు తీరలేదు. కాంగ్రెస్ తప్ప ఇతర కూటమి పార్టీలు ఆప్ కు మద్దతు ఇచ్చాయి. తమకు మద్దతిచ్చినందుకు మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఢిల్లీలో ఆప్ మా ప్రత్యర్థి అని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ గెలుస్తుందని కేజ్రీవాల్ ప్రజల్లో గందరగోళం రేపుతున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రకటనపై కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల రహస్య పొత్తు బట్టబయలైందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: HMPV Virus: కొత్త వైరస్ కోసం పరీక్షలు తప్పనిసరి కాదంటున్న నిపుణులు..
Delhi Elections 2025: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు ఫిబ్రవరి 8న వస్తాయి.
ఈ విషయంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ- గెహ్లాట్, ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఆప్ ప్రతిపక్షమని మీరు స్పష్టం చేశారు. బీజేపీపై మీరు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్‌కు ఆప్ ప్రతిపక్షమని, బీజేపీ దాని భాగస్వామి అని కూడా ప్రజలు భావించారు. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఈ సహకారం రహస్యంగానే సాగింది. ఈరోజు మీరు దానిని పబ్లిక్ చేసారు. ఈ వివరణ ఇచ్చినందుకు ఢిల్లీ ప్రజల తరపున ధన్యవాదాలు అంటూ చెప్పారు.