Hisaab Barabar

Hisaab Barabar: విడుదలైన ‘హిసాబ్ బరాబర్’ ట్రైలర్!

Hisaab Barabar: ప్రముఖ నటుడు ఆర్. మాధవన్, నీల్ నితిన్, కీర్తి కుల్హారి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించిన సినిమా ‘హిసాబ్ బరాబర్’. అశ్విన్ ధీర్ దర్శకత్వంలో జియో స్టూడియోస్, ఎస్.పి. సినీ కార్ప్ ఈ చిత్రాన్నినిర్మించాయి. జీ 5లో ఈ సినిమా జనవరి 24 నుండి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీనిని గమనిస్తే, ఓ బ్యాంక్ చేసే చిన్న పొర‌పాటు ఓ వ్య‌క్తి జీవితాన్ని ఎలా తల్లకిందులు చేసింది, న్యాయం కోసం అతనెలాంటి పోరాటం చేశాడు’ అనేది కనిపిస్తోంది. ప్రేక్ష‌కులు మెచ్చేలా చ‌క్క‌టి డ్రామా, కామెడీ, సామాజిక అంశాల‌తో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. జీ 5లో తాను చేసిన తొలి చిత్రం ఇదని, ఇందులోన రాధే మోహన్ శర్మ పాత్రను ఎంజాయ్ చేస్తూ నటించానని మాధవన్ అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope Today: మీ అడ్డంకులు తొలగి విజయం లభిస్తుంది.. రాశిఫలాలు ఇలా.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *