Priya Prakash Varrier: ఓకే ఒక్క టీజర్ తో ఇండియా మొత్తంలో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. కన్నుగీటుతో క్రేజీ స్టార్ గా మారిన ప్రియ ఆ తర్వాత అనుకున్నస్థాయిలో రాణించలేక పోయింది. ఆరంభంలో స్టార్స్ తో నే చేస్తానని గారాలు పోయి ఆ తర్వాత తేజ సజ్జ, నితిన్ తో సినిమాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్లానింగ్ లోపంతో వెనకపడ్డ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం తన ఆశలన్నీ ధనుష్ తో చేస్తున్న సినిమాపైనే పెట్టుకుంది. ‘నిలావుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ పేరుతో స్వీయ దర్శకత్వంలో ధనుష్ తీస్తున్న సినిమాలో అనికా సురేంద్రన్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది ప్రియా. ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ కాకుండా హిందీలో ‘త్రీ మంకీస్, లవ్ హ్యాకర్స్’ అనే సినిమాలు చేస్తోంది ప్రియా. కన్నడలోనూ ఓ మూవీ లో నటిస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ఆ సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
