High Court: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్‌పాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధే ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సుజయ్‌పాల్‌కు తాత్కాలిక బాధ్యతలను అప్పగించారు. త్వరలోనే ప్రధాన న్యాయమూర్తిని ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ మేరకు సుజయ్ పాల్ బాధ్యతలను స్వీకరించారు.
 
							
