Hyderabad: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పు

Hyderabad: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని.. ఆ అర్హత స్పీకర్‌కు ఉందని సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది.కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు( భద్రాచలం)పై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది.

దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు  డివిజన్ బెంచ్ కీలక అంశాలతో కూడిన తీర్పును వెలువరించింది.   ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి సమయం.. గడువు లేదని.. టైం బాండ్ అంటూ లేదంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని  స్పీకర్ కు సూచించింది హైకోర్టు బెంచ్.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *