High Court: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. నిర్మల్ జిల్లాలో బాలిక మృతి, మాగనూరులో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు, రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఆస్పత్రుల పాలవుతున్న విద్యార్థులు.. లాంటి వార్తలు కలవర పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
High Court: ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని తప్పుబట్టింది. వారంలో మూడుసార్లు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడితే అధికారులు ఏం చేస్తున్నారు? నిద్ర పోతున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పలుచోట్ల విద్యార్థుల అస్వస్థతపై ప్రభుత్వంపై మండిపడింది.
High Court: పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? కనీస స్పందన ఉంటే మళ్లీ ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటాయి? రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. వరుస ఘటనలు.. అధికారులు నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం అని పేర్కొన్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది.