Heavy Rain Alert:

Heavy Rain Alert: దూసుకొస్తున్న మంతా తుఫాన్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు త‌ప్ప‌ని ముప్పు

Heavy Rain Alert:ఈ ఏడాది రానున్న‌ తుఫాన్‌ల‌లో బ‌ల‌మైనదిగా పేర్కొంటున్న మంతా తుఫాన్ దూసుకొస్తున్న‌ది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీచేసింది. అక్టోబ‌ర్ 26 నుంచి 29 వ‌ర‌కు కీల‌కమైన రోజులుగా భావించాల‌ని అధికారులు హెచ్చ‌రించారు. అక్టోబ‌ర్ 28 లేదా 29 తెల్ల‌వారుజామున కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మంతా తుఫాన్ తీర‌దాట‌నున్న‌ద‌ని తెలిపారు.

Heavy Rain Alert:ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి తీవ్ర ముప్పు పొంచి ఉన్న‌ద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీచేసింది. ఉత్త‌రాన‌ విశాఖ‌ప‌ట్నం నుంచి ద‌క్షిణాన తిరుప‌తి వ‌ర‌కూ మంతా తుఫాన్ ముప్పు ప్ర‌భావం ఉంటుంద‌ని, తీవ్ర వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. స‌ముద్ర కోస్తా ప్రాంతాల్లో ఉన్న మ‌త్స్య‌కారుల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, ఎవ‌రూ స‌ముద్ర వేట‌కు వెళ్ల‌రాద‌ని హెచ్చ‌రిక‌లు జారీఅయ్యాయి.

Heavy Rain Alert:దిగువ‌న ఉన్న లోత‌ట్టు ప్రాంతాలు, లంక ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. గంట‌కు 70 నుంచి 100 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తీర‌ప్రాంత జిల్లాల్లోని విద్యాసంస్థ‌ల‌కు అక్టోబ‌ర్ 28, 29 తేదీల్లో సెలువులు ఇవ్వాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు ప్ర‌భుత్వానికి సూచించారు.

Heavy Rain Alert:ఆయా తేదీల్లో దూర‌ప్ర‌యాణాలు పెట్టుకున్న వారు ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోవాల‌ని సూచించారు. మ‌ధ్య కోస్తాంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌చిలీప‌ట్నం, దివిసీమ అన్న‌భాగాల్లో, విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరు, గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ప్ర‌ధానంగా హైద‌రాబాద్ న‌గ‌రానికి భారీ వ‌ర్షాల ముప్పు ఉన్న‌ద‌ని హెచ్చ‌రించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *