Heavy Rain Alert:ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని 10 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Heavy Rain Alert:పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కొద్దిగా బలపడింది. అది 26వ తేదీ వరకు స్థిరంగా ఉండేలా కనిపిస్తున్నది. ఇప్పుడు అది గంటకు 42 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నది. దీని ప్రభావం ఏపీపై ఇప్పుడు తక్కువగానే ఉన్నా ఉత్తరాంధ్ర, తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
Heavy Rain Alert:అదే విధంగా ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచలప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.