Guntur

Guntur: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో హృదయ విదారక ఘటన

Guntur: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. కవల కుమారుల్లో ఒకరిని అమానుషంగా హత్య చేయగా.. మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. ఈ దారుణ ఘటన ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలోని యడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన కంచర్ల సాగర్‌కు మొదటి భార్యతో ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. అయితే, ఆయన తొలి భార్య రెండేళ్ల క్రితం మృతి చెందడంతో, ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 8 నెలల క్రితం ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే తన కన్న బిడ్డను మాత్రం ఆప్యాయంగా చూసుకునే లక్ష్మి.. సాగర్ తొలి భార్య పిల్లలను మాత్రం రోజూ చిత్రహింసలు పెట్టేదని తెలుస్తోంది.

Also Read: Crime News: స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త.. ఎందుకంటే..?

బెల్టు, కర్రలతో వారిని తీవ్రంగా కొట్టేదని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలోనే చిన్న కుమారుడు కార్తిక్‌ను తీవ్రంగా హింసించి, కర్రతో తలపై కొట్టి.. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసిందన్నారు. అంతేకాకుండా పెద్ద కుమారుడు ఆకాష్‌ను గ్యాస్ పొయ్యి మీద వేడెక్కిన అట్లపెనంపై కూర్చోబెట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది.

ఈ వికృత చర్యలకు సాగర్‌ కూడా సహకరించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. బాధిత బాలురుల పరిస్థితిని గమనించిన స్థానికులు ఫిరంగిపురం పోలీసులు తెలపడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *