Anandhi: తెలుగమ్మాయి ఆనంది నటించిన తమిళ చిత్రం ‘వైట్ రోజ్’. ఈ యేడాది ఏప్రిల్ 5న ఈ సినిమా తమిళనాట విడుదలైంది. పోలీసులు పొరపాటున చేసిన ఎన్ కౌంటర్ లో దివ్య భర్త చనిపోతాడు. దాంతో మానసికంగా డిప్రషన్ లోకి వెళ్ళిపోయిన దివ్య కుమార్తె కిడ్నాప్ కు గురౌతుంది. భర్తను శాశ్వితంగా కోల్పోయి, కూతురుకు భౌతికంగా దూరమైన ఆమె పరిస్థితి ఏమిటీ? తిరిగి తన కూతురును కిడ్నాపర్స్ చెర నుండి ఆమె విడిపించుకోగలిగిందా? లేదా అనేదే ఈ సినిమా కథ. ఆనందితో పాటు ఇందులో విజిత్, రితిక చక్రవర్తి, రూసో శ్రీధరన్, ఆర్.కె. సురేశ్ కీలక పాత్రలు పోషించారు. రాజశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్ ఈ నెల 27 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇది కూడా చదవండి: Health Tips: అల్లం – పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు