Arvind Kejriwal: ఢిల్లీలో మహిళలకు ఉచిత చికిత్స, ₹ 2100 ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ – ఆప్ చేసిన ప్రకటనపై యూత్ కాంగ్రెస్ బుధవారం పోలీసు కేసు నమోదు చేసింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అక్షయ్ లక్రా మాట్లాడుతూ.. మోసం, ఫోర్జరీ కింద కేజ్రీవాల్‌పై పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ శాఖలు ఈ రెండు పథకాలను తిరస్కరించాయి. ఈ పరిస్థితిలో ఆప్ అటువంటి వాదనలు ఎలా చేస్తుందని ఆయన అన్నారు.
Arvind Kejriwal: మహిళా సమ్మాన్, సంజీవని లాంటి పథకాలు రాష్ట్రంలో లేవని ఢిల్లీ ప్రభుత్వంలోని రెండు విభాగాలు ఈ ఉదయం వార్తాపత్రికల్లో ప్రకటనలు ప్రచురించాయి. మహిళా సమ్మాన్ యోజనకు సంబంధించి మహిళా శిశు అభివృద్ధి శాఖ తొలి ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ ప్రభుత్వం అటువంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Drinker Sai: డ్రింకర్ సాయి టీమ్ కు ప్రభాస్ విషెస్!
Arvind Kejriwal: సంజీవని పథకానికి సంబంధించి ఢిల్లీలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రెండో ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం అలాంటి పథకాలేవీ అమలు చేయడం లేదన్నారు. కార్డు తయారీ పేరుతో వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు.ఈ విషయం వెలుగులోకి రావడంతో కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ ఎల్జీని బాధ్యులను చేశారు. కాగా, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం అతిశీ తెలిపారు.